తెలంగాణ సిఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కొడుమూరి దయాకర్ రావు
విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజూ ను కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొడుమూరి దయాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిపాలనను మరింత ప్రజలకు చేరువ చేసే చర్యలు, పారదర్శకమైన పాలన, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ అమలు వంటి అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ నాయకత్వంలో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలని కొడుమూరి దయాకర్ రావు ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆయన అభినందించారు.