జి.జె.సి నూతన ప్రిన్సిపాల్ గా   వీరస్వామి

జి.జె.సి నూతన ప్రిన్సిపాల్ గా   వీరస్వామి

విశ్వంభర,  నెల్లికుదురు: కళాశాల విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధనకు పాటుపడుతూ ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తానని జి జె సి నెల్లికుదురు నూతన ప్రిన్సిపాల్ కె.వీరస్వామి తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్‌గా  వీరస్వామి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో పిండిప్రోలు జి జె సి లో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు కళాశాల అభివృద్ధికి కృషి చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం,అధ్యాపక బృందంతో సమన్వయంగా పనిచేయడం, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కల్పించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పొక్కుల సదానందం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పెండిప్రోలు ప్రిన్సిపాల్ రామకృష్ణ, వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు గణేష్, నయీమ్ పాషా తదితరులు పాల్గొని నూతన ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/veeraswamy-as-the-new-principal-of-gjc/article-17900

Tags: