రూ.8.57 కోట్లతో స్ట్రమ్ వాటర్ డ్రైన్ పనులకు శ్రీకారం 

 విశ్వంభర,సూర్యాపేట: సూర్యాపేట పట్టణాన్ని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. పట్టణంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.8.57 కోట్ల వ్యయంతో చేపడుతున్న స్ట్రమ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు నగర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 29వ వార్డు పరిధిలో సద్దుల చెరువు వెనుక అలుగు ప్రాంతం, ఎస్.వి. డిగ్రీ కళాశాల వెనుక నుంచి ఎస్.ఆర్.ఎన్. ఫంక్షన్ హాల్ నుంచి కొత్త ఎస్‌పీ కార్యాలయానికి వెళ్లే మార్గంలోని నాలాలో యూ ఐ డి ఎఫ్  నిధులు రూ.857.40 లక్షలతో చేపట్టనున్న "స్ట్రమ్ వాటర్ డ్రైన్" నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి, నివేదిత  లక్షాధి లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం కోసం ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని దశలవారీగా చేపడతామని, మున్సిపల్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా కృషి కొనసాగుతోందని పేర్కొన్నారు.  పట్టణ అభివృద్ధిలో డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం అత్యంత కీలకమని అన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు నిల్వకుండా వేగంగా వెళ్లేలా శాస్త్రీయ విధానంలో స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే పరిసర ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ , ఇ.ఇ.కిరణ్ , ,29వ వార్డు కౌన్సిలర్ రాపర్తి భవాని శ్రీనివాస్ గౌడ్, చిలివేరు లక్ష్మి కాంతమ్మ, కుమ్మరి కుంట్ల వేణువివిధ వార్డ్ ల కౌన్సిలర్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మున్సిపల్ సిబ్బంది,వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/strum-water-drain-works-started-at-a-cost-of-rs/article-17948

Tags: