డీసీసీ కార్యదర్శిగా హసన్ నియామకం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఎండి. హసన్ కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. సిద్దిపేట జిల్లా డీసీసీ కార్యదర్శి గా ఆయనను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల హుస్నాబాద్ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఎండీ హసన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా డీసీసీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ ప్రజలకు "హసన్ భాయ్"గా సుపరిచితుడైన ఎండీ హసన్‌కు జిల్లా స్థాయి పదవి దక్కడంపై మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అఖిలపక్ష నాయకులు అభినందనలు తెలిపారు.