నూతన సీఎస్ సంజయ్ జాజుకు భాస్కర్ యాదవ్ శుభాకాంక్షలు
విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో నూతన సీఎస్‌ను కలిసిన ఆయన.. పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గజ్జి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలనతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సంజయ్ జాజు మార్గదర్శకత్వం రాష్ట్రాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం అత్యంత విజయవంతంగా సాగాలని, తన అనుభవంతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.