దారి దోపిడీ ముఠా అరెస్టు

దారి దోపిడీ ముఠా అరెస్టు

విశ్వంభర, నల్లకుంట : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాదు నల్లకుంట పోలీసులు అరెస్టు చేయగా, ఒక మైనర్‌ను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ ఏసీపీ జి. జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తిని బ్లేడ్‌తో బెదిరించి నగదు, సెల్‌ఫోన్ దోచుకున్న నిందితులు అనంతరం ఓ పెట్రోల్ బంక్‌లో సిబ్బందిని బెదిరించి పెట్రోలు నింపించుకుని డబ్బులు చెల్లించకుండా పరారయ్యారు. నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాచిగూడకు చెందిన ఫర్దీన్ అలియాస్ నజ్జు, బజ్జలోలు కళ్యాణ్ అలియాస్ సాయి కళ్యాణ్‌ను అరెస్టు చేశారు. ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. నిందితులపై గతంలో కూడా పలు దోపిడీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/robbery-gang-arrested/article-17906

Tags:  

Advertisement

LatestNews

ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్