అక్కన్నపేటలో సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ
విశ్వంభర, హుస్నాబాద్ : అక్కన్నపేట: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అక్కన్నపేట రైతు వేదికలో హెచ్‌డీపీఎస్ విధానంలో సాగు చేసేందుకు అనువైన సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా మాట్లాడుతూ, ఎర్ర నేలలకు హెచ్‌డీపీఎస్ విధానం అత్యంత అనుకూలమని తెలిపారు. ఈ విధానంలో ఎకరాకు ఆరు విత్తన ప్యాకెట్లను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. అలాగే, ఒకేసారి కోత నిర్వహించే అవకాశం ఉండటంతో కూలీ ఖర్చులు గణనీయంగా తగ్గి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఈ పత్తి విత్తనాలను ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె సూచించారు. ఈ డివిజన్ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్, సర్పంచ్ జన్నారపు సంపత్, వ్యవసాయ విస్తరణ అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.