చెస్ట్ ఎక్స్ రే శిబిరం ఏర్పాటు అభినందనీయం
విశ్వంభర, నెల్లికుదురు: పల్లె దవాఖాన ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో శుక్రవారం ఉచిత ఎక్స్ రే శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆ గ్రామ సర్పంచి యాసం సంధ్యా రమేష్ అన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజల హెల్త్ కోసం పల్లె దవాఖాన ముందు చూపుతో క్యాంపు నిర్వహించడం పట్ల ప్రజల ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలం సీజనల్ డిసీజెస్ ప్రబలకుండా ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలోలో పల్లె దావఖానా డా. వినీత్ కుమార్, ఏఎన్ఎం రమ. ఆశ వర్కర్స్ మహేశ్వరి,కవిత,సుజాత,గ్రామస్తులు వాసిరెడ్డి దేవేందర్ రెడ్డి,పెరుమాండ్ల సూరయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.