ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేసి, రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాదు నల్లకుంటలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీసీ విద్యార్థుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్,  బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ల సతీష్ , రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోడీ రాందేవ్,  పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో ఉద్యోగాలు, విదేశీ ఉన్నత విద్య అవకాశాలు వచ్చినప్పటికీ సర్టిఫికెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం రోజుకో జీవో జారీ చేసి విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా గత 18 ఏళ్లుగా అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలని కోరారు. జీవో నెం.9పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొందని, ఫీజులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానం వల్ల కళాశాలలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. విద్యార్థులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం అన్యాయమని, ఈ విధానాన్ని ఉపసంహరించి పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fee-reimbursement-arrears-should-be-released-immediately/article-17936

Tags: