సాదాసీదాగా సమీక్షా సమావేశం
- - డేటా సేకరణలో అధికారుల విఫలం
- - వివేక్, హరీశ్‌రావు సెటైర్లే సెటైర్లు
- - నిర్లక్ష్యపు సమాధానాలతో తప్పుదారి పట్టించిన అధికారులు
- - స్పెషల్ లుక్‌లో ఎంపీ రఘునందన్
విశ్వంభర, సిద్దిపేట: జిల్లాలోని అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో కలెక్టర్ హైమావతి, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం సాదాసీదాగా జరిగింది. జిల్లాలోని అభివృద్ధి పనులపై తూతూ మంత్రంగా చర్చించారు. ఏ ఒక్క శాఖపైన కచ్చితమైన అభివృద్ధి, ప్రణాళికలపై పకడ్బందీగా చర్చించిన దాఖాలాలు కనిపించలేదు. అసలు సమీక్ష చేస్తున్నారా? మమ అనిపిస్తున్నామా అనే రేంజ్‌లో కొనసాగింది సమావేశం. ఓ ఒక్క శాఖపైన బాధ్యతయుతంగా చర్చించలేదు. కేవలం మొక్కుబడిగా పూర్తిచేయడం గమనార్హం. సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశిపతి శ్రీనివాస్, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
డేటా సేకరణలో అధికారుల విఫలం
జిల్లా అభివృద్ధి సమావేశానికి ఏ శాఖ అధికారులు అయినా పూర్తిస్థాయి సమాచారంతో హాజరవుతారు. తమ శాఖలకు సంబంధించిన రివ్య్యూలపై ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. కానీ సమీక్షకు హాజరైన ఏ ఒక్క అధికారి కూడా దాదాపు పూర్తి స్థాయి డేటాతో హాజరు కాలేదని స్పష్టంగా కనిపించింది. ప్రజాప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ సమాచారం తమ దగ్గర లేదని, ఆ పని మా శాఖకు సంబంధించినది కాదని, తెలుసుకుంటామని, త్వరలోనే పనిచేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానాలే చెప్పారు. ఇంకొందరు అధికారులైతే పూర్తిగా తప్పుడు సమాచారం చెబుతూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకొందరు అధికారులు పూర్తికాని అభివృద్ధి పనులు పూర్తయినవని, అయినవి కాలేవని ఇలా ఇష్టానుసారంగా తమకు తోచిన సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఆరోగ్యశాఖపై సమీక్షిస్తుండగా ఎంపీ రఘునందన్ రావు డీఎంహెచ్‌వోతో మాట్లాడుతూ.. మీరొచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రయివేట్ ఆస్పత్రులు తనిఖీచేశారు? ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ఉన్నాయా? ఫైర్, మున్సిపల్ ఎన్వోసీలు ఎన్ని ఆస్పత్రులకు ఉన్నాయాంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ ప్రశ్నకు డీఎంహెచ్‌వో సమాధానమిస్తూ అన్నీ ఆస్పత్రుల్లో ఫైర్ సేప్టీ ఉందని, ధరల పట్టికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవన్నది జగమెరిగిన సత్యం. ఇదీ మచ్చుకు ఓ శాఖ అధికారి చెప్పిన తీరు. అన్నీ శాఖల సమీక్షలోనూ ఇలాంటి తప్పుడు సమాధానాలే అధికారుల నోటి నుంచి స్పష్టంగా కనిపించాయి, వినిపించాయి.
వివేక్, హరీశ్‌రావు సెటైర్లే సెటైర్లు
సమీక్షా సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, హరీశ్‌రావు ఒకరిపై ఒకరు పోటాపోటీగా సెటైర్లు వేసుకున్నారు. సెటైర్లు వేసుకునే క్రమంలో పలుమార్లు నవ్వులు పూయించారు.
జిల్లాలోని పలు సమస్యల గురించి మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నిస్తుండగా మంత్రి వివేక్ తన తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ అడ్డు తగిలారు. అంతే స్పీడ్‌గా హరీశ్‌రావు మాట్లాడుతూ ఇది జిల్లా సమస్య అని రాష్ట్ర సమస్య కాదని సమాధానామిచ్చారు. రాష్ట్ర సమస్యను అసెంబ్లీలో మాట్లాడుకుందామని ఇప్పుడు జిల్లా సమస్యల గురించి మాట్లాడుకుందామని కౌంటరిచ్చాడు. హరీశ్‌రావు కౌంటర్‌కు మంత్రి కూడా అంతే స్పీడ్‌గా మాట్లాడుతూ ఓహో పదేండ్ల బకాయిలా, పదేండ్ల కింద ముచ్చటా అంటూ కౌంటరిచ్చాడు. మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీశ్‌రావు పరస్పరం వాదించుకుంటున్న క్రమంలో పలుమార్లు జోకులు పేలాయి. దీంతో అధికారులు, జర్నలిస్టులు ఘోల్లుమనడం కనిపించింది. మొత్తంగా సమావేశం టైంపాస్ వ్యవహరంగా మారిందని చెప్పొచ్చు.
స్పెషల్ లుక్‌లో ఎంపీ రఘునందన్
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జిల్లా అభివృద్ధి సమావేశానికి స్పెషల్ లుక్‌లో హాజరయ్యారు. సాధారణంగా రఘునందన్‌రావు వైట్ లేదా కాషాయ రంగు షర్ట్స్ ధరిస్తుంటాడు. కానీ ఎప్పటిలాగా కాకుండా వెరైటీ లుక్‌లో హాజరయ్యాడు. పూర్తిగా నలుపు రంగు చొక్కా ధరించి హాజరుకావడంతో పూర్తి యంగ్ బాయ్ మాదిరిగా కనిపించాడు. ఎంపీ రోజురోజుకు యంగ్‌లా తయారవుతున్నాడని పలువురు మాట్లాడుకోవడం వినిపించింది. కాగా రఘునందన్‌రావు అడిగిన చాలా ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పలేక నోరెళ్లబెట్టారు. సమావేశ అనంతరం వివేక్, హరీశ్ అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు.