చైతన్య నగర్‌లో వాటర్ ప్లాంట్ పనులు ప్రారంభం

విశ్వంభర, కేసముద్రం: మండల కేంద్రంలోని చైతన్య నగర్ కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గతంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ నేతృత్వంలో చైతన్య నగర్ కాలనీ వాసులు, మాజీ ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్ కలిసి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, కాలనీకి మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయించడంతో ప్రస్తుతం అక్కడ వాటర్ ప్లాంట్ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ నేతృత్వంలో చైతన్య నగర్ కాలనీ వాసుల బృందం, మాజీ ఎంపీటీసీ కొమ్ము స్వాతి రాహుల్, వళ్ళందాస్ మహేష్, పెండ్యల రవికుమార్ తదితరులు హైదరాబాద్‌లోని జాటోతు హుస్సేన్ నాయక్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే తరుణంలో మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ వాసులు సైతం స్వచ్ఛమైన తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నాయకులు హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. చైతన్య నగర్ తరహాలోనే ఎన్టీఆర్ కాలనీకి కూడా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ, ఎన్టీఆర్ కాలనీలో కూడా త్వరలోనే వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారని బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/water-plant-works-started-in-chaitanya-nagar/article-17896

Tags: