అరుణోదయ నాగన్న మృతికి ప్రజానాట్యమండలి సంతాపం
విశ్వంభర, హైదరాబాదు : ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న మృతిపై తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పీడిత ప్రజల కోసం పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన కళాకారుడిగా నాగన్న విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానాట్యమండలి నిర్వహించిన సాంస్కృతిక ఉద్యమాలు, ఐక్య పోరాటాల్లో నాగన్నతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. మానవతావాది, వామపక్ష ఉద్యమాల చైతన్య గొంతుకగా నిలిచిన నాగన్న మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆశయ సాధన కోసం కళాకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.