రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ

రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ

విశ్వంభర, చింతపల్లి:  పత్తి ఉత్పాదకత మిషన్ (కాటన్ కపాస్ క్రాంతి స్కీం) కింద రైతులకు పత్తి విత్తనాలు వంద శాతం సబ్సిడీతో ఉచిత పంపిణీ చేయడం జరుగుతుందని చింతపల్లి మండలంలోని అన్ని రైతు వేదికలలో ఈ పథకం కింద రైతులకు విత్తనాలు శనివారం పంపిణీ చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో మండల వ్యవసాయ అధికారిని ఏవో శ్రావణ కుమారి తెలిపారు. చింతపల్లి రైతు వేదికలో గురువారం స్థానిక సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్క రైతుకు ఒక్క ఎకరానికి విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. జియో టాగింగ్  ద్వారా పంటలను అధికారులు పర్యవేక్షిస్తారని ఆమె అన్నారు. రైతులకు సాగువ్యయం తగ్గించి అధిక దిగుబడి సాధించేలా నాణ్యమైన పత్తి విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ ఉచిత విత్తనాలను ఇంతకు ముందు వేసిన పంటల సాళ్ళలో మధ్యలో వేయకూడదన్నారు. ఒక ఎకరం పోలంలో సపరేటుగా హెచ్ డి పి ఎస్    పద్ధతిలో వేసుకోవాలని పంటకు మందులు, ఎరువులు కూడా సెపరేట్ గా వేసుకోవాలని ఆమె సూచించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-cotton-seeds-to-farmers/article-17902

Tags: