కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్ లతో  మూగజీవాలు బలి

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని ‌11వ వార్డు ఆఫీస్ రోడ్డు పాత గ్రంథాలయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షం కారణంగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి, కాలనీకి చెందిన రాజమల్లు, ప్రశాంత్‌లకు చెందిన రెండు గేదెలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని అన్ని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sacrifice-of-mutes-with-unfenced-transformers/article-17922

Tags: