ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం: భాగ్యలక్ష్మి
విశ్వంభర, నల్లకుంట : ఓటు హక్కు విలువను ప్రతి పౌరుడు గుర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్ భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని నల్లకుంట డివిజన్ విజ్ఞానపురి కాలనీలో బూత్ నంబర్–11 పరిధిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను కలిసి ఓటరు జాబితా సంబంధిత సర్వే పత్రాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ వెన్నెలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని అన్నారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా చూసుకోవడం, తప్పులు ఉంటే సరిదిద్దుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా సర్వేలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. యువతతో పాటు మహిళలు కూడా ఓటరు నమోదులో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయడానికి బీజేపీ కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.