సొంత డబ్బుతో తీగేడు లో  బోరు వేయించిన మాజీ సర్పంచ్

విశ్వంభర, చింతపల్లి: మండలంలోని తీదేడు గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పుట్టినరోజు సందర్భంగా సొంత నిధులతో గ్రామ ప్రజలకు బోరును వేయించిన తీదేడు మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి. గ్రామంలోని కాలనీ వాసులకు తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున అక్కడి ప్రజలు తీదేడు గ్రామ సర్పంచ్ కు పలు మార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. మాజీ సర్పంచ్ కాయితీ జితేందర్ రెడ్డి తన సొంత నిధులతో మీ కాలనీ వాసులకు బోరు వేయిస్తానని చెప్పి నేడు శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలునాయక్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో బోరు వేయించి, మోటారును బిగించి ప్రారంభించారు. బోరు వేయించినందుకు కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డిని శాలవతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో తీదేడు మాజీ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, కలగొని రాజశేఖర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామవత్ హనుమ నాయక్, దాసరి మారయ్య, సందే లక్ష్మయ్య, పల్లెటి నర్సింహ, సందే బిక్షం, నెలపట్ల మురళి, గంటేల నరేష్, ఉడుత లింగయ్య, రామవత్ శ్రీను నాయక్, రామవత్ భగ్గు నాయక్, కలగొని మల్లయ్య, తిరుమని విష్ణు, పూల వెంకటయ్య, సందే వెంకటయ్య, నర్సింహ, రామలింగం, శ్రీను, రాములు, రాశిక శంకర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-sarpanch-who-built-a-hole-in-thigedu-with-his/article-17975

Tags: