ఉద్యోగాల భర్తీ కోసం 15న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
విశ్వంభర, హైదరాబాదు : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 60 లక్షల, తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని 2 లక్షల ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. శుక్రవారం హైదరాబాదు ఎంబీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటాలకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పేదలకు 120 గజాల ఇళ్ల స్థలాలు కేటాయించి, గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు నియంత్రణ చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి. జ్యోతి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.