అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని వినతి

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలని వినతి

విశ్వంభర, హైదరాబాదు : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాదు ప్రజాభవన్‌లో ప్రజావాణికి వినతిపత్రం సమర్పించారు. బీఎల్‌వో విధులను రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ కేంద్రాలను అంగన్‌వాడీలకు అప్పగించాలని, రూ.18 వేల వేతనం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వినతిపత్రం స్వీకరించిన ప్రజావాణి అధికారులు సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో: అంగన్‌వాడీ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు కె. సునీత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి ఈ. వెంకటమ్మ బి. స్వప్న బి. లలిత నాగమణి శైలజ రమా కుమారి ఏక లక్ష్మి భాస్కరక్క నర్సమ్మ అన్నపూర్ణ కరుణ పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/request-to-solve-anganwadi-problems/article-17910

Tags: