మాలపల్లిలో సిసి రోడ్డు పనులు ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్: గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవతో ఈజీఎస్ పనులలో భాగంగా శుక్రవారం హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజుతో కలిసి సిసి రోడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించినట్లు హుస్నాబాద్ బిజెపి మండల అధ్యక్షులు భూక్య సంపత్ నాయక్, హుస్నాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెన్న రాజు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్మాణం చేపడుతున్నామని గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలపల్లి గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత,ఉప సర్పంచ్ బత్తుల శ్రీనివాస్ వార్డ్ సభ్యులు అనిత వెంకటలక్ష్మి కవిత వీరస్వామి శారద రజనీకాంత్ గ్రామపంచాయతీ కార్యదర్శి దివ్య మరియు మాజీ సర్పంచ్ బత్తుల మల్లయ్య బిజెపి నాయకులు బైరి అరుణ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.