హుస్నాబాద్ లో నూతన డయాగ్నొస్టిక్  సెంటర్ ప్రారంభం

విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో రాజమహేంద్ర డయోగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ,  వైస్ చైర్ పర్సన్ చిత్తారి  పద్మ రవీందర్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం అత్యాధునిక సేవల ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటు ధరలలో కచ్చితత్వంతో,తక్కువ ఖర్చులతో రక్త  పరీక్షలు చేయడమే లక్ష్యంగా రాజమహేంద్ర డయాగ్నొస్టిక్ ల్యాబ్ ప్రారంభించామని నిర్వాహకులు  రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదపాక రవీందర్, బత్తుల స్వరూప రవీందర్ వాలా సుప్రజ నవీన్ రావు సైదాపూర్ మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, పెరమండ్ల  నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-new-diagnostic-center-in-husnabad/article-17932

Tags: