మునిపంపులలో ఉచిత దంత వైద్య శిబిరం

మునిపంపులలో ఉచిత దంత వైద్య శిబిరం

విశ్వంభర, రామన్నపేట: కామినేని దంత వైద్యశాల, నార్కట్పల్లి  సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం,  మునిపంపుల గ్రామంలోని భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని దంత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన కామినేని దంత వైద్యశాల వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో దంత వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలు అందించారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు శిబిరానికి హాజరై దంత పరీక్షలు చేయించుకుని వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో కామినేని దంత వైద్యశాల పిఆర్ఓ చంద్రశేఖర్, డా.శృతి,డా.రామాసాయి చరణ్, డా.మణికంఠ, డా.హసీత రాజ్, డా.దూబే దీప్తి, డా.అమూల్య రెడ్డి, భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు తాళ్లపల్లి జితేందర్, గంటెపాక శివ కుమార్, బూడిద బిక్షం, ఉండ్రాతి నర్సింహా, జంపాల ఉమాపతి, హేమలత, సంధ్య, ఉమ, గ్రామ ప్రముఖులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/free-dental-camp-in-munipur/article-17952

Tags: