కోర్టులో కేసు ఉన్న భూమిలో జోక్యం చేసుకోవద్దు : జహీరాబి విజ్ఞప్తి
- దౌర్జన్యాలు, బెదిరింపులతో భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన
విశ్వంభర, షాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్ ఖాన్ రెండో భార్య జహీరాబికి చెందిన 3 ఎకరాల 4 గుంటల భూమిని ఆమెకు తెలియకుండా ఆమె పెద్ద కుమారుడు, కోడలు జకియా బేగం అదే గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డికి విక్రయించారని జహీరాబి ఆరోపించారు. అనంతరం ఆ భూమిని ఈగ జనార్దన్ రెడ్డి, ఈగ కార్తీక్ రెడ్డి, ఈగ విజయలక్ష్మి రెడ్డిలకు విక్రయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై తాను 2021లో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉందని జహీరాబి తెలిపారు. కేసు నడుస్తున్నప్పటికీ జనార్దన్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతూ, గ్రామంలోని కొందరిని డబ్బులతో ప్రలోభపెట్టి తనను భూమి వద్దకు రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కొందరు కిరాయి వ్యక్తులను తీసుకువచ్చి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని మీడియా సమావేశంలో వాపోయారు. ఈ విషయమై సంబంధిత అధికారులను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఏ తీర్పు ఇచ్చినా దానికి తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అలాగే ఈ భూ వివాదానికి సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నరసింహులు, ఉపసర్పంచ్ కుమ్మరి వేణు గోపాల్ తదితరులకు ఎలాంటి సంబంధం లేదని జహీరాబి స్పష్టం చేశారు. ఈ విషయంలో వారిని అనవసరంగా వివాదంలోకి లాగవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి ఖలీం ఖాన్, ఎండి చాంద్ ఖాన్, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.