అంబర్‌పేటలో ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట్ డివిజన్ బాపూనగర్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా బూత్ లెవల్ అధికారులకు అందజేయాలని సూచించారు. ఫారాల పూరణలో ప్రజలు హెల్ప్‌డెస్క్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో: కాలేరు మణికాంత్, సింగజోగి శ్రీనివాస్, కే. సింహాచలం, బందారం అనిల్ గౌడ్, నరసింహచారి (చిమ్మి), మొహమ్మద్ అమీర్, మహమ్మద్ ఫెరోజ్, వెంకటేష్, రాహుల్ ముదిరాజ్, అక్షయ్ కుమార్, మొహమ్మద్ ఇబ్రహీం, ఇమ్రాన్, హరీష్, అఖిల్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గంలోని 40 మంది లబ్ధిదారులకు రూ.13,67,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ సకాలంలో అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/launch-of-sir-helpdesk-at-amberpet/article-17973

Tags: