నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది: జడల సురేందర్
విశ్వంభర, అందుగులపల్లి: అకాల వర్షాలతో ఇల్లు కోల్పోయిన నిరుపేద కుటుంబానికి మున్నూరు కాపు సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ రూ.35 వేల విలువైన సహాయాన్ని అందించింది. అందుగులపల్లి గ్రామానికి చెందిన కామ వెంకన్న, సుగుణ దంపతుల ఇంటి పునర్నిర్మాణానికి అవసరమైన రేకులతో పాటు రూ.6 వేల నగదును జిల్లా అధ్యక్షుడు జడల సురేందర్ అందజేశారు. ఈ సందర్భంగా జడల సురేందర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అర్హులైన నిరుపేద మున్నూరు కాపు కుటుంబాలకు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్. రాజయ్య మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలు, విద్యార్థుల చదువులు, ప్రకృతి విపత్తుల బాధితులకు ఆర్థిక సహాయం అందించేలా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, గ్రామ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.