ఉచిత హోమియో వైద్య సేవల ప్రారంభం : సర్పంచ్ నవీన్
- గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం వైద్య సేవలు
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిమ్స్ హోమియోపతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ అధ్యక్షతన ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులతో కలిసి ఉచిత హోమియో ఆయుర్వేద వైద్య చికిత్సలు ప్రారంభించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా డివిజనల్ పంచాయతి అధికారి కందుకూర్ డివిజన్, సాంబి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆధునిక వైద్యంతో పాటు హోమియోపతి ఆయుర్వేద వైద్యం కూడా అనేక దీర్ఘకాలిక సాధారణ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్సను అందిస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరారు. అలాగే, గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఈ ఉచిత హోమియో ఆయుర్వేద వైద్య సేవలు ప్రతి శుక్రవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేశారు. గ్రామ ప్రజలతో పాటు మహేశ్వరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉచితంగా అందిస్తున్న ఈ యొక్క వైద్య సేవలను ఆయుర్వేద వైద్యులచే పరీక్షలు చేయించుకొని, అవసరమైన మందులను ఉచితంగా పొందవచ్చని గ్రామస్తులకు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం జరుగుతుందని తెలిపారు, కార్యక్రమం అనంతరం వైద్య బృందం గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సుమారు 130 మందికి బిపి షుగర్ , మోకాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, స్త్రీల సమస్యలు పిల్లల సమస్యలు తెలుసుకొని వారికి అవసరమైన ఉచిత హోమియో ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ , ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, మాజీ కొ ఆప్షన్ మెంబర్ సయ్యద్ అదిల్ అలీ, డా. దొలే కాలేజ్ ప్రిన్సిపల్ డా. పూనం సుతార్, డా. శ్రావణి, డా,విరాజ్ కుమార్, ఆవులకాడి శ్రీశైలం, నిమ్మగూడెం దయానంద్ గౌడ్, తెల్జీరి శ్రీశైలం, దుడ్డు కృష్ణ, బొమ్మనమైన బాబు మోతే కృష్ణ, వైధ్య సిబ్బంది పాల్గొన్నారు.