అంగన్‌వాడీలకు కేంద్ర సహకారం కోరిన సీతక్క

విశ్వంభర, న్యూఢిల్లీ : తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై  వినతిపత్రాలు సమర్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్న అల్పాహారం, పాలు పంపిణీ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక సహకారం అందించాలని, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను పెంచాలని కోరారు. టీనేజ్ బాలికల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమం అమలు కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sitakka-sought-central-support-for-anganwadis/article-17969

Tags: