గర్రెపల్లిలో  సామూహిక అక్షరాభ్యాసం

గర్రెపల్లిలో  సామూహిక అక్షరాభ్యాసం

విశ్వంభర, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గర్రెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వేద సంకల్ప ట్రస్ట్, దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సరస్వతి పూజతో పాటు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి జంపాల సంతోష్ చిన్నారులకు పెన్నులు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేసి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచమల్ల శ్రీకాంత్, ఉప సర్పంచ్ కౌడగాని వీరేశం, వి.ఓ. బెల్లి రజిత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mass-literacy-in-garrepally/article-17924

Tags: