అరుణోదయ నాగన్నకు విప్లవ నివాళి
విశ్వంభర, విద్యానగర్ : అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు అరుణోదయ నాగన్న మృతికి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం హైదరాబాదు విద్యానగర్ మార్క్స్ భవన్‌లో అరుణోదయ, ఐఎఫ్‌టీయూ, పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూతో పాటు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నివాళులర్పించారు. అరుణోదయ గ్రేటర్ హైదరాబాదు ప్రధాన కార్యదర్శి కోలా స్వప్న అధ్యక్షతన ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలం నుంచి విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో నాగన్న విశేష సేవలందించారని అన్నారు. ప్రజా చైతన్యం కోసం అనేక పాటలు, బుర్రకథలు, జానపద కళారూపాలను సృష్టించి ఉద్యమాలకు బలాన్ని చేకూర్చారని పేర్కొన్నారు. ఆయన మృతి విప్లవ, సాంస్కృతిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.ఈ కార్యక్రమంలో: టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్, పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాదు ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, సుజాత, పద్మ, చందు, రహీం, హసీనా పాల్గొన్నారు.