గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించడానికే
- ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: గ్రామీణ ప్రాంతాలలోని పేద పిల్లలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో రూ 250 కోట్లతో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్బంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ హుజుర్నగర్ నియోజకవర్గంలోని కొన్ని వేల మంది గ్రామీణ స్థాయి పిల్లలకు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ స్టాండర్డ్ బోర్డింగ్ హాస్టల్ సదుపాయంతో విద్యను అందించడానికి రూ. 250 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 2,500 మందివిద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడానికి అన్ని వసతులు ఈ స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగినదని గుత్తందారులు, ఇంజనీర్లు నిరంతరం పనులు చేస్తున్నారని, అట్టి పనులు పరిశీలించడానికి ఇక్కడికి వచ్చానని వచ్చే సంవత్సరం 2027 నాటికి పనులు పూర్తయి, 2027 అకాడమిక్ సంవత్సరంలో క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. సమావేశంలో హుజుర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఇంచార్జ్ తాసిల్దార్ స్రవంతి, ఆర్ అండ్ బి ఎస్సి సీతారామయ్య, గుతేదారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.