రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
విశ్వంభర, ఘట్కేసర్: వరంగల్ జిల్లా పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీష దంపతులు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. దంపతుల మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.