సొసైటీ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలి

సొసైటీ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలి

  • విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు మద్దతు
  • విమలక్క

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు మింట్ కౌంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు అరుణోదయ సాంస్కృతిక సమైక్య, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ, ప్రభుత్వం, యజమాన్యం తక్షణమే స్పందించి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్మాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులు, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్లు, ప్రైవేట్ మీటర్ రీడర్లు, పీఏఏ, ఎస్పీఎం కార్మికులు, హమాలీలకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు. అలాగే 2026 పీఆర్‌సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని సూచించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అరుణోదయ సాంస్కృతిక సమైక్య, అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మెకు తోడుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్సూర్ పోతుల రమేష్, మల్లేష్, సుంకు సతీష్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Tags: