మండల స్థాయి సమావేశం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రాములు, మండల తహసీల్దార్ లాల్ బహదూర్, మండల స్పెషల్ ఆఫీసర్ సాహితి, మండల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫసర్ డి.నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్-చైర్మన్ మల్లారెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



