లక్ష్మాపురం ఐకెపి సెంటర్ ప్రారంభం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, లక్ష్మాపురం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రామన్నపేట-వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాయక్, వైస్-చైర్మన్ మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేడు మన గ్రామంలో ఇందిరమ్మ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే జాగ్రత్త పడి రైతులు ఇబ్బంది పడొద్దని 15 రోజులు ముందుగా సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం, సిసి, లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ సునీత, కొత్తగూడెం సర్పంచ్ యాదమ్మ, వార్డు సభ్యులు మహిళా సంఘాలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, గ్రామ రైతులు, ఐకెపి సిబ్బంది, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.



