ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు
- జిల్లా వ్యాప్తంగా మండల సభలు
- కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల అధ్యక్షతన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరయ్యారు. మండల సభలో పాల్గొన్న కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ సర్పంచులు తమ పరిధిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 12వ వార్డు కౌన్సిలర్ గౌతంరెడ్డి తమ వార్డు పరిధిలో సిసి రోడ్లు అంతర్గతనం అభివృద్ధి పనులు చేయవలసిందిగా కోరారు. వీరారం ఏడవ వార్డు లో బోర్ రిపేర్ చేయాలని కోరారు. బాల్య తండ సర్పంచ్ కెనాల్ పనులు పూర్తి చేయాలని కోరారు. నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న 99 రోజుల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్ ల వారిగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రోడ్ సేఫ్టీ, హెల్మెట్ సీట్ బెల్ట్, రవాణా భద్రతపై ఈ వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ఒక అంశంపై జిల్లా ఎస్పీ శబరిష్, జిల్లా అధికారులు రవాణా శాఖ సిబ్బంది విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలోని యువత చెడు సహవాసాలకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే తెలియపరచి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే మరిపెడ ప్రాంతంలో ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని సూచించారు. పట్టణంలోని క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై ఎవరైనా సిబ్బంది గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజలను ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిపెడ మండలం లో ఇరిగేషన్, తాగునీరు, సానిటేషన్, హెల్త్ , ఎడ్యుకేషన్ తదితర అంశాలలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మండల సభలో పాల్గొని వివిధ సమస్యలను వినతులను సమర్పించిన వివరాలను స్వీకరించి వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. వరి పంటలు కాకుండా ఇతర వాణిజ్య పంటల వైపు రైతులను ముగ్గు చూపే విధంగా చర్యలు తీసుకోవాలని, అధిక శాతం యూరియా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు, కావున ప్రజా ప్రతినిధులు ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువుల వైపు రైతులు ముగ్గు చూపే విధంగా చూడాలని రైతులు కూడా బాధ్యత అధికంగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ ను తగ్గించాలన్నారు.నానో యూరియా ఇతర ప్రత్యామ్నాయ మందులను వాడాలని సేంద్రియ ఎరువులు మంచివని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకొని ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని, ఎస్పీ ఎలాగైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ప్రతి ఒక్కరు సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా నిర్ణయించుకుని సమాజం బాగుకోసం యువత సన్మార్గంలో నడవడానికి కంకణ బద్ధులై పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ విసారపు ప్రగతి, వైస్ చైర్పర్సన్ కాలం సునీత, సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి, వైస్ చైర్మన్ కాలం సునీత, మున్సిపల్ కమిషనర్ విజయనంద్, తాసిల్దార్ కృష్ణవేణి, అగ్రికల్చర్ ఏవో వీరాసింగ్, హౌసింగ్, మున్సిపల్ ఏఈలు ఉషా కీర్తి, శృతి, మండల వైద్యాధికారి డాక్టర్ రవి, ఎంఈఓ అనిత, సిడిపిఓ ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.



