ఘనంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణం

ఘనంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణం

 విశ్వంభర, సూర్యాపేట: మాస శివరాత్రిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషి మాత దేవాలయంలో గురువారం పార్వతి పరమేశ్వరుల కళ్యాణాన్ని దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి, గంగాదేవి శివుడు , చండీశ్వరుడు ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రములు అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై శాస్త్రోక్తంగా కళ్యాణ తంతు నిర్వహించారు. అంతకుముందు మూలవిరాట్ శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.భక్తులు   స్వామివారి కళ్యాణాన్ని ఆసాంతం తిలకించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ మాట్లాడుతూ 2026 ఆంగ్ల సంవత్సరము నుండి ప్రతినెలా మాస శివరాత్రి రోజున ఉదయం 10 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెళ్ళికాని యువతీ యువకులు ఈ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే శీఘ్రముగా కళ్యాణము జరిగి ఒక ఇంటి వారు అవుతారని తెలిపారు. కళ్యాణ అనంతరం భక్తులకు  ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్త ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాశరావు కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు బేలిదే అశోక్, సహాయ కార్యదర్శిలు దేవరశెట్టి సోమయ్య, యామా వెంకటేశ్వర్లు, కక్కిరేణీ పద్మ, అశోక లక్ష్మి,మోదుగు లక్ష్మారెడ్డి, తెడ్ల పల్లవి, యామా వీరలక్ష్మీ,కుక్కడపు కృష్ణమూర్తి, వరలక్ష్మి, కనకరత్నం,దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Tags: