పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
- దిండి లెఫ్ట్ ను రద్దు చేయాలి
- మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ
విశ్వంభర, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం, మహబూబ్నగర్ జిల్లా వలసలు, కరువు చర్చనీయాంశమయ్యాయి. కృష్ణా జలాల పంపిణీలో మహబూబ్నగర్ జిల్లాకు వాటర్ తగ్గలేదని అంశం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు పోసింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు గడుస్తున్న మహబూబ్నగర్ నీటి సమస్య మిగిలే ఉందన్నారు. కృష్ణా జలాల పంపిణీలో మహబూబ్నగర్ కు అన్యాయం జరుగుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అరకొరగా కొనసాగాయని ఎక్కడ ఎకరం పొలానికి కూడా నీళ్లు తగ్గే పరిస్థితి తెలియదు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణకే నీళ్లను మళ్లించారని విమర్శించారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి మూడు సంవత్సరాలలో కాలేశ్వరం పూర్తి చేశారని బిఎల్ఆర్ ను మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ అన్యాయం కొనసాగుతుండగానే దిండి ఎత్తిపోతల పేరుతో కృష్ణానది నీటిని మహబూబ్నగర్ ప్రజలకు అందకుండా నలగొండ జిల్లాకు తరలించే కుట్ర జరుగుతుందన్నారు. న్యాయంగా మహబూబ్నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటి వాట కోసం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయాలని, దిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి గారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలిస్తున్న బిజెపి మూడు పార్టీలు కూడా మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేశాయని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంలో జిల్లా రాజకీయ నాయకత్వం విఫలమైందన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మొద్దు నిద్ర వదిలే మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల కొరకు కృషి చేయాలని కోరారు. టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ జిల్లా సాగునీటి సౌకర్యాలు లేని కారణంగా పేద ప్రజలు వలసలు వెళుతున్నారు అని విమర్శించారు. ఇప్పటికీ దేశంలో అనేక ప్రధాన నగరాలలో మహబూబ్నగర్ జిల్లా వలస కార్మికులు పొట్ట చేత పట్టుకుని జీవిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రిటైర్డ్ తహసిల్దార్ చిన్న కృష్ణయ్య మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన నాయకులతోపాటు వివిధ రంగాలలోని మేధావులు, న్యాయవాదులు ఏకమై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పడ్డామని తెలిపారు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఎమ్మార్జేసి నాయకులు అని మహమ్మద్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎన్నికల ముందు హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణలో రన్నింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ తిమ్మప్ప మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తమ నేటి వాట కోసం, కరువు నివారణ కొరకు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ పోరాటాల ఫలితంగా సాధించుకున్న జీవో 72ను కేసీఆర్ చెత్తబుట్టిన పడేశారని ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు పాల్గొన్నారు.



