నాణ్యతా ప్రమాణాలు బేఖాతరు
On
విశ్వంభర, బోడుప్పల్జి: హెచ్ఎంసిలో కొత్తగా విలీనమైన బోడుప్పల్ మున్సిపాలిటీల్లో వర్షపు నీటి సంరక్షణ పనులు అత్యంత అశాస్త్రీయంగా జరుగుతున్నాయని స్థానిక నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినప్పటికీ, జలమండలి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేశారని ఆరోపిస్తున్నారు. ఇంకుడు గుంత పరిమాణం సరిగ్గా లేకపోవడం, గ్రావెల్ ఫిల్లింగ్ లోపాలు, సైడ్ వాల్స్ నిర్మించకపోవడమే కాకుండా.. నిబంధనల ప్రకారం వాడాల్సిన 20 మిమీ మెటల్, ఇసుకకు బదులుగా ఎర్రమట్టితో నింపేస్తున్నారని వాపోతున్నారు. ప్రజాధనం వృధా కాకుండా, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని బోడుప్పల్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.



