ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి:  ఎమ్మెల్యే  రామ్మోహన్‌రెడ్డి సూచన

విశ్వంభర, పరిగి: పరిగి నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే డా. తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించినట్లు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రాములు, పరిగి మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ బద్రిగారి రాజపుల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఐఆర్ ఓటరు సవరణ ప్రక్రియకు గడువు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, యువజన కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిగి మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ బద్రిగారి రాజపుల్లారెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రాములతో కలిసి పరిగి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన సమావేశాల్లో పాల్గొని ఓటరు సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-suggested-that-the-sir-process-should-be/article-19844

Tags: