తూకం వేసి ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే దిగుమతి చేసుకోవాలి

విశ్వంభర, రామన్నపేట: అకాల వర్షాలకు తూకం వేసి ఉంచిన ధాన్యపు బస్తాలు తడిసి ముద్దవకుండా త్వరగా లారీలు పంపించి ఎగుమతులు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మిల్లు యజమానిని కోరారు. ఇంద్రపాలనగరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సర్పంచుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సుమారు ఆరు వేలకు పైగా తూకం వేసిన ధాన్యపు బస్తాలు ఉన్నాయని, కొనుగోళ్ళు నిలిపివేయడంతో అక్కడ రైతులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వారి ఆవేదనను తెలియచేశారు. లారీలు రావడం లేదని, ఎవరికీ ఫోన్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు విన్న సర్పంచ్ వెంటనే, స్థానిక రైతులతో కలిసి విద్య ఆగ్రో మిల్లు లోకి వెళ్లి మిల్లు నిర్వాహకులతో గ్రామ రైతులు పడుతున్న ఆవేదన తెలియచేసి ఐకేపీ, పిఏసిఎస్ కేంద్రాలలో తూకం వేసి ఉన్న ధాన్యపు బస్తాలను దిగుమతి చేసుకోవడానికి లారీలను పంపించి ధాన్యపు బస్తాలను వేగంగా దిగుమతి చేసుకోవాలని మిల్లర్లతో, అధికారులతో చర్చించి రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/weighed-grain-sacks-should-be-imported-immediately/article-16050

Tags: