సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు 

విశ్వంభర, హిమాయత్ నగర్ :  జూన్‌ రెండో వారం లోపు సమస్యలు పరిష్కరించాలి లేకపోతే సమ్మె తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం హైదరాబాదు హిమాయత్ నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాల మఖ్దూంభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు. సింగరేణి బకాయిలు పెరుగుతున్నాయని, రావాల్సిన నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని, కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడం ఆపి కోల్ ఇండియా తరహాలో సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, వారసత్వ ఉద్యోగాల విధానాలను పునరుద్ధరించాలని, పెన్షన్లను పెంచాలని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని తెలిపారు. కార్పొరేట్‌లపై పన్నులు పెంచి ప్రజలపై భారం తగ్గించాలని సూచించారు. ప్రొఫెసర్‌ కే నాగేశ్వర్పై కేసులు నమోదు చేయడం సరికాదని, విమర్శలను ప్రజాస్వామ్య దృక్పథంతో స్వీకరించాలని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, డ్రగ్స్ నియంత్రణపై నిఘా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పంచాయతీ, ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు మెరుగైన వేతనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, సమస్యలు జూన్‌ రెండో వారం లోపు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.  కూనంనేని సాంబశివరావు, వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-strike-is-inevitable-if-the-singareni-issues-are-not/article-16009

Tags: