నిరుపేద మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన రవ్వ శ్రవణ్ కుమార్ (35) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ 5,000 రూపాయలు విలువైన నిత్యవసర వస్తువులు రవ్వ శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భర్త ఈడెం శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రవణ్ మరణించడం చాలా బాధాకరమని, భవిష్యత్తులో శ్రవణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మిరియాల జగన్నాథం, పాశం దీక్షిత్, ఠాకూర్ రమేష్ సింగ్, గంజి రంగయ్య, గూడెల్లి దామోదర్, నన్నూరి రవీందర్, కర్రే రాజు, మిరియాల రాజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.