ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల కల సాకారం

ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల కల సాకారం

  • జిల్లాలో ఒకే రోజు 2700 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు
  • జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

విశ్వంభర, గంభీరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంతో ఇండ్లు లేని నిరుపేదల కల సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. బుధవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమీపంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇండ్లను వచ్చే నెల 1 వ తేదీన గృహ ప్రవేశాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, డీఈ సాజిద్, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-dream-of-the-poor-has-come-true-with-indiramma/article-16046

Tags: