బాల్య వివాహాలు, మహిళల వేధింపులపై కఠిన చర్యలు

  • గుండాల మండలంలో పోష్ యాక్ట్ అవగాహన సమావేశం

విశ్వంభర, గుండాల : గుండాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో “ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పోష్ యాక్ట్–2013 పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య మాట్లాడుతూ, పోష్ యాక్ట్–2013 ప్రకారం పనిచేసే చోట మహిళలను వేధించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు నిర్వహించిన వారిపైనా చట్టరీత్యా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మండలంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. పెళ్లిళ్లు నిర్ణయించే ముందు తప్పనిసరిగా వధూవరుల వయస్సు ధృవీకరణ పత్రాలు పరిశీలించాలని సూచించారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు జరపాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై అయ్యగార్లు,చర్చి ఫాదర్లు, ముస్లిం పెద్దలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఎం. శోభన్ బాబు మాట్లాడుతూ, మహిళలు లేదా బాలికలు ఎక్కడైనా వేధింపులకు గురైతే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం 100, 112, మహిళా సహాయ కేంద్రం 181, బాలల సహాయ కేంద్రం 1098 వంటి హెల్ప్‌లైన్ నంబర్ల వివరాలను తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించిన అధికారులు, సమాజంలో చైతన్యం పెంపొందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, ఎంపీఓ సలీం, సీడీపీఓ నాజీ, ఉపసర్పంచ్ సాయి కుమార్, సూపర్వైజర్లు షమీమ్, యాకూబ్ పాషా, అనిల్ కుమార్, పాస్టర్ వెంకటేశ్వర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/child-marriage-is-a-strict-measure-against-abuse-of-women/article-16025

Tags: