అమావాస్య సందర్బంగా అన్నప్రసాద వితరణ
పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ , డా. కాచం సత్యనారాయణ
విశ్వంభర, గాంధీనగర్ :- అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం గాంధీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , ప్రముఖ సామాజికవేత్త , వైశ్యవికాస వేదిక , వీత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక ల చైర్మన్ డా. కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. అతిధులు మాట్లాడుతూ అమావాస్య నాడు ఇలాంటి అన్నదాన కార్యక్రమం పెట్టి ఎంతో మంది అభాగ్యులకు , పాదచారులకు, అన్నప్రసాదం అందించడం చాల గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేపట్టాలని సామాజిక సేవలో భాగం కావాలని వారన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెలతో 53వ అమావాస్యలు పూర్తి చేసుకున్నామని అన్నారు. పాల్గొన్న అతిధులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ ట్రెజరర్ సోమిశెట్టి శ్రీనివాస్, నక్క అమర్నాథ్, వీరేష్, వి పబ్బ శ్రీనివాస్, పబ్బ విశ్వనాథం, పబ్బా శ్రీశైలం, శ్రీధర్, దారం కృష్ణ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.