బావి పూడికతీత.. పై భాగం కూలి రైతుకు తీవ్ర గాయాలు

విశ్వంభర, నెల్లికుదురు: వ్యవసాయ భూమిలోని బావిలో పూడిక తీస్తున్న క్రమంలో రైతుపై భావి పైభాగం దిమ్మ కూలడంతో తీవ్ర గాయాలైన ఘటన నెల్లికుదురు మండలం జామ తండా శివారు శంకర్ నాయక్ తండాలో చోటుచేసుకుంది. రైతు గుగులోతు శంకర్ నాయక్ బుధవారం తన వ్యవసాయ బావిలోని పూడికను తీస్తున్న క్రమంలో బావి పైభాగం దిమ్మ ఒక్కసారిగా కూలింది. బావిలో ఉన్న శంకర్ నాయక్ పై మట్టి దిమ్మలు కూలడంతో ప్రైవేట్ పార్ట్ కు తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు  108 కు సమాచారం అందించారు. క్షణాల్లో పైలెట్ ప్రశాంత్, ఏఎంటి వీరన్నలు అంబులెన్స్ ను తీసుకువచ్చి  క్షతగాత్రుని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే ఏఎంటి వీరన్న అత్యవసర చికిత్స అందించారు. మహబూబాబాద్ లోని నవోదయ ఆసుపత్రిలో చేర్చారు.వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 108 సిబ్బంది అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాపాయస్థితి తప్పిందని ఆసుపత్రి వైద్యులు సిబ్బందిని అభినందించారు. ఏఎంటి వీరన్న,పైలెట్ ప్రశాంత్ సమయస్ఫూర్తి అత్యవసర చికిత్స పట్ల తండావాసులతోపాటు మండల ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-farmer-who-was-working-on-the-upper-part-of/article-16001

Tags: