గురుకుల పాఠశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామ పరిధిలో గల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పలు గెస్ట్ (అతిధి) ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల కళాశాలలో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఆంగ్లము, తెలుగు అధ్యాపక పోస్టులు, అలాగే, గురుకుల పాఠశాలలో  తెలుగు, హిందీ, ఆంగ్లము, గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాలీగా ఉన్నాయి. అర్హతలు, దరఖాస్తు గడువు పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ/ పీజీతో పాటు బిఎడ్, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో ఈ నెల 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు జనంపల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురుకుల పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/applications-are-invited-for-filling-up-the-teaching-posts-in/article-16019

Tags: