లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ

విశ్వంభర, కేసముద్రం: సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండే లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం ఆధ్వర్యంలో  మారగాని కృష్ణ కుమారుడు మారగాని సత్య కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేసి సేవా స్పూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సమాజ సేవే తమ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో లక్కాకుల సత్యనారాయణ, రాపాక కుమారస్వామి, రుద్ర శ్రీకాంత్, చల్లమల్ల కిరణ్ కుమార్, చింత కరుణాకర్, ముదిరెడ్డి శ్రీనివాస్, మడిపెద్ది వెంకటేష్, మారగాని శ్రీధర్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/buttermilk-distribution-under-the-auspices-of-the-lions-club/article-16040

Tags: