కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి 

విశ్వంభర, హుస్నాబాద్ : కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి  రాంగోపాల్ రెడ్డి నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం మరియు మిల్లర్ల వైఖరి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మొక్కజొన్న కొనుగోళ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  కేంద్ర మంత్రికి వివరించారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో,ఐకేపి సెంటర్ లలో రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .రైతుల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని, రైతుల సమస్యల పరిష్కారానికి తగిన పోరాట కార్యక్రమాలు రూపొందించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. వీరితో పాటు అక్కన్నపేట మండల అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/komati-reddy-ramgopal-reddy-met-union-minister-bandi-sanjay/article-16034

Tags: