ముప్పేట  దాడులు ..తనిఖీలు. 

ముప్పేట  దాడులు ..తనిఖీలు. 

  •  నాటుసారా తయారీపై ప్రత్యేక దాడులు 
  •  బార్ల నిర్వాహణపై స్పెషల్ ఫోకస్

విశ్వంభర, జిహెచ్ఎంసి : కెమికల్ తయారీ కంపెనీల తనిఖీలు గంజాయి..డ్రగ్స్, నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్ పై నిఘా..
సమిష్టి పని తీరుతో మంచి ఫలితాలు అందిస్తాయి. ఎక్సైజ్ శాఖ, ఎస్టీఎఫ్,  డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, డీసీఏ (డ్రగ్ కంట్రోల్  ఆథారిటి) కలిసి సంయుక్తంగా చేస్తున్న దాడులు మంచి ఫలితాలనిచ్చాయి. ఎక్సైజ్ రెవెన్యూ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రొహిబిషన్ అండ్  ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్  కమిషనర్లు ఈఎస్‌లతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం, ఎక్సైజ్  శాఖకు కొత్తగా వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి   టాస్క్‌ఫోర్స్ టీమ్‌లతో ప్రత్యేక సమీక్షా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలనే   అదేశాలు, వీటికి తోడు ఎక్సైజ్ రెవెన్యూకు విఘాతం కల్పిస్తున్న   నేరాలపై ఉన్నతాధికారులు సమీక్షాలు నిర్వహించారు. ఈ సమావేశాలు, ఉన్నతాధి కారుల అదేశాలతో ఎక్సైజ్ స్టేషన్లు, ఎస్టీఎఫ్,  ఎన్‌ఫోర్స్‌ మెంట్ టీమ్‌లు, డీటీఎఫ్ టీమ్‌లు ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ కమిషనర్ అంజన్ రావు పర్యవేక్షణలో ముప్పేట దాడులు,  ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నాటుసారా తయారీపై ప్రత్యేక దాడులు..నాటుసారాపై ఈ నెలలో ప్రత్యేక ఫోకస్ చేశారు. చాల జిల్లాల్లో నాటుసారా తయారీ అమ్మకాలు, రవాణ లేవు. కొన్ని జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ తండాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో తయారవుతున్న నాటుసారాను అరికట్టడానికి ఎక్సైజ్ స్టేషన్లతోపాటు స్థానికి ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ టీమ్‌లతోపాటు ఈ సారి ప్రత్యేకంగా ఎస్టీఎఫ్ టీమ్‌లు రంగంలోకి దాడులలను ముమ్మరం చేశారు. నాటుసారా ప్రధానంగా మహబూబ్‌నగర్, అదిలాబాద్, వరంగల్,  నల్లగొండ ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిదాడులు  నిర్వహించారు.మరికొన్ని ప్రాంతాల్లో తయారవుతున్న నాటుసారా  బట్టీలపై దాడులు నిర్వహించారు.గత 20 రోజుల్లో 1218 కేసులు  నాటుసారా తయారీదారులపై , రవాణ, అమ్మకందార్లపై కేసులు నమోదు చేశారు. 4643 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.  69,220 బెల్లం పానకాన్ని నేలపాలు చేశారు. 45,994 కేజీల బెల్లాన్ని  స్వాధీనం చేసుకున్నారు. సంయుక్తదాడులు. సింథటిక్ డ్రగ్స్ తయారీ, మత్తును కలిగించే ఇంజక్షన్లు, కల్తీ కల్లు  తయారీకి వినియోగించే ఆల్పోజోలం, వీటితో పాటు ప్రమాదకరమైన  పెయింటనిల్, మేఫెడ్రోన్ మందుల తయారీ, వినియోగం,  అమ్మకాలపై పరిశీలనకు డీసీఏ నుంచి డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్టీఎఫ్  టీమ్ లీడర్లు కలిసి పలు పార్మ అండ్ కెమికల్ కంపెనీల్లో అకస్మీకంగా  తనిఖీలు నిర్వహించారు. సుమారు 15 కంపెనీల్లో అడుగడుగన తనిఖీలు    నిర్వహించారు. కెమికల్ కంపెనీల్లోను, మత్తు మందులను   అమ్మకాలు జరిపే కంపెనీల్లో  ప్రత్యేక తనిఖీలు గుబులు పుట్టించాయి.  హైదారబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా బార్లు ఉన్నాయి.   ఈ బార్లు నిబంధలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఎస్టీఎఫ్ టీమ్‌లు ఈ నెల 12 నుంచి దాడులు నిర్వహించి  47  బార్లపై తనిఖీలు నిర్వహించారు. ఫిర్యాదుల మేరకు వారిపై పలు రకాల చర్యలకు నివేదికలు ఇచ్చారు.  మరోపక్క నిత్యం ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు   తమ దాడుల్లో భాగంగా ఢిల్లీ, గోవా, హర్యానా, ఇతర ప్రాంతాల  నుంచి వచ్చె ఎన్‌డీపీఎల్ (నాన్‌డ్యూటిపెయిడ్ లిక్కర్,) డిఫెన్స్ లిక్కర్,  మిక్సింగ్ లిక్కర్‌ను తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 556.02 లీటర్ల  మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యంతోపాటు 244 కేజీల గంజాయిని, ఎండీఎంఎ, ఇతర డ్రగ్స్‌ను పట్టుకున్నారు.WhatsApp Image 2026-05-27 at 10.33.30 PM

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/muppetta-%C2%A0attacks-checks/article-16052

Tags: