పిడుగుపాటుతో మృతి చెందిన ఎద్దుకు పంచనామా
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన పిడుగులతో కూడిన అకాల వర్షానికి గ్రామానికి చెందిన రైతు పోషబోయిన ఎర్రయ్య ఎద్దు పిడుగు పడి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న రామన్నపేట వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇందిర తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, చనిపోయిన ఎద్దుకు పంచనామా నిర్వహించినారు. అనంతరం మాట్లాడుతూ, ఎద్దు సుమారుగా ఆరు సంవత్సరాలు ఉంటుందని తెలిపినారు. ప్రభుత్వానికి తమ పంచనామ నివేదికలో పిడుగుపాటుతో ఎద్దు చనిపోయిందని తెలుపుతామని, సంబంధిత రైతుకు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో గోగు వెంకన్న, మేడబోయిన కృష్ణ, పోషబోయిన నరసింహ, పోషబోయిన ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.